Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జపానుదేశము - వేదాంతము.

229

యినదిగానే యెంచఁబడును. అది బౌద్ధులు తలఁచునట్లు శూ న్యమయినదిగాఁ దలంవఁబడదు. కావున వేదాంతము ప్రతి మనుజుని సత్యమైన ప్రయోజకునిగాఁ జేయుటకుఁ జాలినంత యవకాశమున్నది) అని మాక్సుమూలరు దొరవారు వాసి యున్నారు. కానవేదాంతమును బాగుగా గ్రంహించినవారి కది యేమిహానిని జేయును? ఏమియును హానిచేయుదు. సరి కదా మాక్పుమూలరు దొరవారు చెప్పినట్లుగా బహూవకా రముకూడఁ జేయును. వేదాంతము ప్రతినరుని తనధర్మము ను (one's own duty, తానాచరించవలెనని తెలుపుచున్న ది గాని మానుమని తెలుపుటలేదు. పూర్ణమయిన వేదాం తమును బోధించుచున్న భగవద్గీత యేమి బోధించుచున్నది? అందు శ్రీకృష్ణుఁడు అర్జునునికిఁ దుధన నేమి బోధించినాఁ డు? ఇంత వేదాంతమును బోధించి యిన్ని విధముల “జగ న్మిధ్య ” యని చెప్పి తుదకు నరుని శత్రు జయము చేసిరా జ్యమును సంపాదింప వలసినదని గట్టిగా బోధించినాఁడు. కావున నీవేదాంతబోధ ప్రవృత్తి మార్గమునకు నరుని బురి కొలువుచున్నదే కాని నిరుత్సాహిని జేయుటలేదు. ఇప్పుడు లోకములో మంచి నాగరికత నందిన జపాను ఇంగ్లాండు మొదలగు దేశములందలి వారు భగవద్గీతలో శ్రీకృష్ణుఁడు చేసిన బోధ ననుసరించుటచే ఘనతను గాంచుచున్నారు గాని బైబిలులో క్రీస్తు చేసిన నివృత్తిమార్గబోధ ననుసరించు టచేతకాదు. క్రీస్తు కుడిచెంపపైఁ గొట్టిన నెడమ చెంప పట్ట