Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

ఉపన్యాసపయోనిధి

సికొని లేదుకావున నామతగురువులు యుక్తికి మూలా ధా రమైన వేదాంతమునకును మూఢభక్తికి మూలాధారమైన మ తమునకును సంబంధము కనిపెట్టలేక వేదాంతము మతము కాదని నిందింపఁ జొచ్చిరేకాని బొగుగా నాలోచించి చూడఁ గా వేదాంతమునకును సన్మతమునకును నేమియు భేదము కాన్పింపదు. ఈమాటల నేననుటలేదు. సమస్త మతముల బాగుగా నారసి చూచినట్టియు లోక జ్ఞానధురీణత దాల్సిన ట్టియు మంచి క్రైస్తవులలోనొక్కరగునట్టియు మాక్సుమూ లరు దొరవారు (Max Muller) వ్రాసియున్నారు. What distinguishes the Vedanta Philosophy from all other philosophies is that it is at the same time a religion and a philosophy(ఇతర దేశములందలి వేదాంతములవలెఁ గాక హిందువుల వేదాంతము మతమును వేదాంతకునుగూ డనైయున్నది) అని వ్రాయించి యున్నారు. కావున రవి ప త్త్రికాధివతులు “ఈ వేదాంతము మతమనుకొనుభ్రమ యీదే శమువారికి గొందఱికిగలిగియున్నది" అని వ్రాయించుటతప్పు.

ఇక వేదాంతము మూలముగా హిందూదేశము క్షీణధశ కువచ్చినదని సాహసించి వ్రాయుట రెండవతప్పు. ఎట్లన:

వేదాంతము “జగన్మిథ్య” యనిబోధించుచున్న మాట సత్య ము. ఈబోధవలన రవివత్రిక వారు తలఁచినట్లుగాఁ బ్రజలు చెడిపోవుటకుఁ దగిన సందర్భమేదియును లేదు' “మిధ్య' య ననేమో వీరికిఁ దెలియక పోవుటచే తామే భ్రమచెంది యొ