Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేదములు - శోత్రియులు.

215

Persian kings, are even they the dates & deeds of many of the kings of Judah & Israel.” అనిమాక్స్ మూలరు దొరవారు వాసియున్నారు. ఇట్టి మహత్తరమైన వేదమును మనపూర్వులు: బహుభ ద్రముగాఁ గాపాడియున్నారు. ఈవిషయమున శ్రోత్రియు లుమిక్కిలివర్ణనీయులు “వేదమూలమిదం బ్రాహ్మ్య” మని పెద్దలు చెప్పుచున్నారు. “శ్రుతమువలనను శ్రోత్రీయుండగు" నని పంచమవేదము భారతము నొక్కివక్కాణించుచున్నది. ఈ యమూల్యమగు విద్యాధనమును కాపాడుటకు మనపూ ర్వులగు బ్రాహ్మణులు తమ జీవితముల ధారపోసి యు న్నారు. “శ్లో॥ ఉచ్చైర్ గతిర్జగతిసిద్ధ్యతిధర్మతశ్చేత్ | తస్య ప్రమాచవచనైః కృత కేతరైశ్చేత్ | తేషాం ప్రకాశనదశాచ మహీసురైశ్చేత్ | తానంతరేణనిపతేత్ క్వనుమత్ప్రణామః అనిభోజరాజు చెప్పినట్లుగా వేదములఁ బ్రకాశింవఁ జేయుట బ్రాహ్మణుల పనిగానున్నది. ఒక్క వేదములనే కాదు సర్వ శాస్త్రములను శ్రోత్రియులు బహుశ్రద్ధగాఁ గాపాడియు న్నారు.

"To them (Brahmins) also is due the credit of having preserved from destruction all the books of history or of Science that have survived the revolu- tions by which the country has been so often con- vulsed." అని డూబోయి అను ఫ్రెంచిమిషనరి వ్రాసియున్నాఁడు. వే