Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేదములు - శోత్రియులు.

213

ople suspect" అని మాక్సుముల్లరుదొర వారు చెప్పినట్లుగా బహూపకారకమగు మంచి భావముల నిచ్చునవిగా నున్నవి. ఈగాధలను (mythology) బట్టియే మాక్సుమూలరు, బాల గంగాధరతిలక్కు మొదలుగాఁ గల విద్వద్వరులు అనేకము లగు సద్విషయములనుగనిపెట్టి యున్నారు. ఇట్టియమూల్య జ్ఞానఖనుల త్రవ్వి చూపు నది వేదమైయున్నది.

"the study of Mythology has assumed an entirely new character, chiefly owing to the light that has been thrown on it by the ancient Vedic Mythology of India. But though the foundation of a true Science of Mythology has been laid, all the detail has still to be worked out, & could be worked out nowhere better than in India.”

అని మాక్సుమూలరుదొరవారు వ్రాసినట్లుగా నీరహస్య ములఁదెలిసికొనుటకు వేద మాధారమైయున్నది.

భూతత్వశాస్త్రము, మున్ను గాఁగల శాస్త్రములవలన మానవుఁడుతొల్లి యుత్తరదిగ్భాగమున మేరు సమీపముననివ సించెడివాఁడని తెలియవచ్చుచున్నదనియునా దిగ్భాగము లి ప్పుడు మంచుతోమంనింగియుండి మానవ నివాసయోగ్యమం గాలేకున్నవిగావున నచ్చట మనుజులు నివసించెడివారని తె లుపుటకు సందర్భము గాని యాధారముగాని కాన్పించుట లేదని శాస్త్రజ్ఞులు సంశయాకుల మానసులై యున్నారు. వేదమును బట్టియా యూహకు మంచిపూర్ణాదిని విద్వద్వరుల