ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సత్యవాదిని - భగవద్గీత - వేదములు.
209
ద్దేశము. కవిత్వవిషయములో మాధుర్య సౌందర్యములకుగీతచాలప్రసిద్ధికెక్కినది.)
(8) చంద్రనగరు కోర్టులో ప్రసిడెంటుపనిచేసిన జాకోలియట్టు (Jocolliot) బైబిల్ ఇన్ ఇండియా (Bible in India) అనుగ్రంథములో నిట్లువ్రాసినాఁడు.
"But I believe in Christna, philosopher and moralist, I admire his lessons, so sublime and so pure, that later the founder of Christianity in Europe percieved that he could not do better than imitate them."
వేదాంతమును నీతినిబోధించిన కృష్ణునందు నాకునమ్మకముకలదు. ఆయన యుపన్యాసములు (గీతలు) నాకు చాల అద్భుతముగాఁ గాన్పించుచున్నవి. తరువాత బయలు వెడలిన పశ్చిమదేశపు క్రైస్తవ మతస్థాపకుఁడు కృష్ణునిబోధల ననుసరించుటకంటె మఱియొకటిచేయలేదు. ఆయనభోధలంత ఘనముగను బవిత్రముగను నున్నవి.