Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208

ఉపన్యాసపయోనిధి.

(7) పచ్చిక్రైస్తవమతబోధకులు భగవద్గీతాపరీక్ష అను శీర్షికక్రింద ఈవాక్యములను వ్రాసియున్నారు.

"There are some sublime descriptions of God. He is eternal, of infinite power, of unmeasured glory, omnipresent, the source of all that exist. The poem is also strongly marked by the religiousness which has always characterised the Hindus. God is seen in all things and all things are seen in God. The highest pleasures and honours of the world, even the enjoyment of Indras heaven, are considered far inferior to union with Brahma. The great object of the poem is to show how this end may be gained. As a poetical work, the Gita is noted for its beauty and sweetness.”

(అందుఁగొన్ని ఘనవర్ణనములు కలవు అతఁడునిత్యుఁడు సర్వశక్తియుక్తుఁడు. అనంతమహిమాసమేతుఁడు సర్వాంతర్యామి సమస్తపదార్థములకుఁ గారణభూతుఁడు హిందువుల ప్రధానలక్షణమైయున్న మతౌన్నత్యముచే గ్రంధమువిశేషముగా నలంకరింపఁబడియున్నది. భగవంతునందు సమస్తపదార్థములను సమస్తపదార్థములందు భగవంతునిజూపుచున్నది. భౌతికమైన సమస్తానందములును గౌరవములును ఇంద్రలోకసౌఖ్యముసహా బ్రహ్మైక్యానందముకంటె చాలతక్కువవిగా నెంచఁబడుచున్నవి. బ్రహ్మైక్యానందఫలప్ర్రాప్తినందు మార్గమును దెలుపుటయేగీతయొక్క ముఖ్యో