206
ఉపన్యాసపయోనిధి.
బనికి వచ్చుచున్నవేకాని వానిని గ్రిందుపఱచుటకు వినియోగించుటలేదు.
భగవద్గీతనుగూర్చి యితరదేశస్థులగు ప్రాజ్ఞులిచ్చిన అభిప్రాయములు.
మనదేశమున రాజప్రతినిధిగాఁ బనిచేసిన వారను హేస్టింగ్సుదొరవారు (Warren Hastings) గీతనుగూర్చి యిట్లు ముచ్చటించిరి.
(1) "There is in it a sublimity of conception, reasoning and diction almost unequalled” (అందుగల యూహలు యుక్తులు రచనయు నిరుపమానములు.)
(2) హంబోల్టు (Humbolt) అనుజ్ఞాని యిట్లువ్రాయుచున్నాఁడు.
"The most beautiful, perhaps properly the only true philosohpical song that exists in any known tongue" (లోకమునంగల సుప్రసిద్థభాషలలో నింతసత్యమైన వేదాంత గ్రంథము (గీతములు) లేదు. ఇయ్యది చాలమనోహరమైనది.)
(3) స్లెజల్ (Schlegel) అనుజ్ఞాని భగవద్గీతను లాటిను (Latin) భాషలోనికి భాషాంతరీకరించి తుదిని గీతల బోధించిన శ్రీకృష్ణునిగూర్చి యిట్లువ్రాసియున్నాడు.
“Whose oracular soul is, as it were, snatched aloft into divine and eternal truth with a certain and neffable delight” (అతనిదివ్యాంతరాత్మ నిక్కమును అని