సత్యవాదిని - భగవద్గీత - వేదములు.
205
స్త్రీయసందర్భము లేకుండఁగూర్పఁబడియున్న ఘనవిషయములనే తీసికొని శాస్త్రకారులు శాస్త్రములను వ్రాసిరి. శిష్యునకు ప్రసంగాను సారమైన బోధచేయుటయే శ్రీకృష్ణులపనిగాని దానిని బెద్దశాస్త్రముగాఁ గూర్చుటకాదు. ప్రసంగానుసారమైన హటాద్బోధసహజమైన సృష్టివంటిది. శాస్త్రీయ క్రమమునకై యుద్యమించి చేయుబోధ క్రమోద్దేశపూర్వకముగాఁ జేయు కృత్రిమసృష్టివంటిది. ఎట్లన వనమునందు నుద్యానమునందున్న క్రమముండదు. కావున నుద్యానకారునకు వనకారుఁడు (భగవంతుఁడు) చాలఁడనియు సుస్థిరవ్యాఘాతరహితసృష్టిని చేయలేకపోయినాఁడనియుఁ జెప్పిన నెంతసరసముగనుండునో సూత్రాదులవలె గీతలు శాస్త్రీయక్రమము కలవికావు కావున నియ్యవి పరిహాసపాత్రములని తలంచుట యంతసరసముగా నుండును. భగవంతుని సృష్టియందెచ్చటఁజూచినను వ్యాఘాతపరంపరయే కాన్పించుచున్నదికదా. అయినను జ్ఞానులు సృష్టియందువ్యాఘాతరహిత క్రమమునేచూచుచున్నారు. అట్లనేమాక్సుమూలరుదొరవారు చెప్పినట్లు ఆలోచించి చూచిన జ్ఞానులకు సుస్థిర వ్యాఘాతరహిత క్రమమేకాన్పించుచున్నది. భగవంతుని సృష్టి (వనము) యెట్లున్నదో యట్లెగీతలున్నవి. మానవనిర్మాణ (ఉద్యాన) మెట్లున్నదో యట్లె సూత్రాదులున్నవి. కావునగీతలయందలి వ్యాఘాతాభాసములుగీతలు ఉపనిషత్తులలోనివనియను మాటను రూఢిచేయుటకుఁ