Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యవాదిని - భగవద్గీత - వేదములు.

201

రామశబ్ధముకంటెఘనమయినది కాఁగలదా. రామశబ్దమన్నిటికంటె ఘనమయినది గనుకనే యాపత్సమయమున దాని నుచ్చరించుట కలిగినది. అట్లె సామమన్నిటి కంటె ఘనమయినదికనుక నే పైతృకకర్మములందు దానిని వాడుట కలిగినది. అన్నిటికంటె పావనమును దారకమును గనుకనే పైతృకమునకై సామవేదమును వినియోగించుట కలిగినది. సామముమేధ్యమని శ్రుతులు మొఱలిడుచునే యున్నవికదా.

III అధర్వణవేదము.

అధర్వణవేదము కాఠకములను వేదభాగములందె తెల్పబడియుండుటను బ్రధానోపనిషత్తు లందుఁగూడఁ దెలుపఁబడి యుండుటను నయ్యది మిగుల ప్రాచీనమేయని గ్రహింపవలసియున్నది. అంతియకాక పాణినివ్యాకరణములో పాణిని “అధర్వణికస్యేకలోపశ్చ" అనుసూత్రములో నధర్వణపదముతనకాలములో విపులముగా వాడుకలోనున్నట్లె వ్రాసియున్నాఁడు. కావున సర్వవిధముల అధర్వణవేద మితరవేదములవలెఁ బ్రాచీనమేకాని నవీనము కాదు.

సత్యవాదినీ పత్రికోపవిలేఖకులగు "కె" గారు భగవద్గీతయందు శాస్త్రీయ క్రమము లేదని 'టిలాంగుగారు' చెప్పినదాని నామోదించుట యొక గొప్ప విశేషమయియున్నది. మన “కే” గారు భగవద్గీత వ్యాఘాతపరంపరతోఁ గూడుకొనియుండుట యొక గొప్పలోవముగా భావించిరి. శ్రీ