సత్యవాదిని - భగవద్గీత - వేదములు.
195
త్వంమమతే జోంశసంభవమ్॥' (విభూతికాంతి ఊర్జితత్వముగల వస్తువులేవో యవియన్నియు నాయంశములెగాఁ దెలిసికొనవలసినది) అనుశ్లోకమువలన సామవేద మితరముకంటె ఘనమైనదిగనుకనే వేదములలో సామవేదము నేనని శ్రీకృష్ణులవారు చెప్పియున్నారని విస్పష్టముగా గీతలవలననే తేలుచున్నది. సందర్భమంతయు నిట్లుండఁగా మన 'కే' గారు ఎక్కువప్రమాణములగు వీనినన్నిటిని బాటింపక వీనికంటె నధమప్రమాణములగు వానినిదీసికొని లోకమందఱిచేతను గొనియాడఁబడుచున్న గీతలను దద్బోధకులను నిందింప సాహసించుట యుచితమా?
సామవేదము II
ఇఁక సామవేదమితరవేదములకంటె తక్కువఁగాది జెప్పుచున్నట్లు కాన్పించుప్రమాణములనుగూర్చి ముచ్చటించుకొందము. అమూల్యపత్రికారత్నమగు సత్యవాదినిలో 'కాని సామవేదమునకిట్టి గౌరవము మొదటినుండియు లేదు. ఆపస్తంబసూత్రములలో 1వ ప్రశ్నలో 3వ పటలములో, 19, 20 ఖండికలను జూడుఁడు - శ్వగర్ధభనాదాః సలావృక్యేకసృకోలూకశబ్దా స్సర్వేవాదిత్రశబ్దారోదన గీతసామశబ్దాశ్చ—(19) శాఖాంతరేచ సామ్నామనాథ్యాయః (30 అనేకములగు కుక్కలు మొఱుగునపుడును అనేకములగు గాడిదలోండ్రపెట్టునపుడును తోఁడేలు కూయునపుడును నక్క