194
ఉపన్యాసపయోనిధి.
"ఋగ్భ్యోజాతసర్వశోమూతిన్‌మాహుః। సర్వాగతిర్యాజుషీహైవశశ్వత్ । సర్వంతేజస్సామరూప్యగ్ హశశ్వత్" అను శ్రుతివాక్యములవలనఁ గూడ సామదము యొక్క శ్రైష్ఠ్యము తేలుచున్నది. సూర్యునిమూతిన్ ఋక్కువలనను గతి యజుస్సువలనను తేజస్సుసామమువలనను గలిగినవనిదీనిభావము.
'ఋక్చవా ఇదమగ్రేసామచాస్తా' మను నైతరేయబ్రహ్మణమునందును సామముయొక్కమహిమము బుక్కుకంటెగొప్పదని తెలుపఁబడియున్నది.
వీనినన్నిటినిబట్టి ప్రమాణములలో నెల్లవరకు ప్రమాణమైన శ్రుతులవలన వేదములలోనెల్ల సామవేదమే శ్రేష్ఠమైనదని తేలుచున్నది. ఇఁక సామవేదము పరిశుద్ధమైనదా యపరిశుద్ధమైనదాయన "ఋచాంప్ర్రాచీమహాతిదిగుచ్య తే। దక్షిణామాహుర్యజుషామపారాం । అధర్వణామంగిరసాంద్రతీ చీమహతీదిగుచ్యతే ప్రాచీనముదీచీనం దక్షిణామేధ్యం' మొదలగు శ్రుతులనుబట్టి సామవేదము మేధ్యమనియే తేలుచున్నది.
శ్రుతులన్నియు సామవేదము శ్రేష్ఠమయినదనియు పవిత్రమైనదనియుఁ దెల్పుచున్నవి. కావుననే భగవద్గీతలో శ్రీకృష్ణులవారు 'వేదానాం సామవేదోస్మి' యని చెప్పిరి. ఈవాక్యముగల దశమోధ్యాయముయొక్క 'శ్లో॥ యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేనవా! తత్తదేవావగచ్ఛ