Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

ఉపన్యాసపయోనిధి.

క సామవేదముయొక్క ఘనతను వర్ణించిన శ్రుతివాక్యములనీయక దాని నధఃకరించినట్లు కాన్పించుచున్న వానినిమాత్రముచూపి సంతసించుటయె కాక 'ఈయపరిశుద్ధ వాక్యములే శ్రీకృష్ణస్వరూపమా? 16000 గోపికాదారలు గాక గొల్లపల్లెయందలి స్త్రీజనసామాన్యమును యుక్తాయుక్తవివేచనలేక జారస్త్రీలను జేసినమహాపురుషుం డేస్వరూపమైనగావచ్చును” అనివ్రాసిన వాక్యరత్నములను బట్టి వీరిహృదయము బుద్ధిమంతులకు గోచరము కాకపోదు. ఈసందర్భమునఁ జదువరులు తెలిసికొనవలసిన ముఖ్యవిషయమేమ నటిలాంగుగారు భగవద్గీతలఁగాని వేదముఁగాని నిందింపలేదనియు గీతలను బురాతనములని తెలుపుటకై వారెత్తిన యుక్తులను దీసికొని తమయిచ్చవచ్చినట్లు మార్చి గీతలను నిందించుటకై మన 'కే' గారు మాత్రమే యుద్యమించుచున్నారనియుఁ దెలిసికొనుటయైయున్నది. 'కే' గారి హృదయమెట్టిదైన మనకేమి గీతలలో "వేదానాం సామవేదోస్మి” యని శ్రీకృష్ణభగవానులవారు చెప్పినదాని సారస్యమును లోకమునకు వెల్లడిచేయుదము.

"ఏషాంభూతానాం పృధివీరసః పృధివ్య ఆపోరస అపామేషధయోరస ఓషధీనాం పురుషోరసః పురుషస్వవాగ్రసోవాచ ఋగ్రనఋచస్సామరసస్సాన్న ఉద్గీధోరసః' అనుఛాందోగ్యోపనిషద్వాక్యమువలన ఋగ్వేదముకంటెనుగూడసామవేదము శ్రేష్ఠమయినదని తెలియవచ్చుచున్నది. వా