Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

ఉపన్యాసపయోనిధి.

పఁబడినది. తామును ఈదృశ్య ప్రపంచమునుగూడ నాపరమాత్మలో నేక దేశములేయని తలంచుచున్నారు. మిక్కిలిమూఢమగు బహుదేవతారాధనము చేయువారలు కూడ భగవంతుఁడొక్క డేయనుటకు వెనుదీయరు. అంతియకాకభగవంతుఁడు సత్యముగా నొక్కఁడేయనియు అయినను అతఁడు బహువిధములుగాఁ బరిదృశ్యమానుఁ డగుచున్నాఁడనియు, నాతనిబహువిధనామరూపముల, అవతారములఁ బూజింప వలెననియుఁ దలంచుచున్నారు.) ఈదొరవారువ్రాసినది సర్వవిధముల సత్యమైయున్నది.

శ్రుతులు భగవంతుఁడొక్కఁడేయని పలుతావుల ఘోషించుచున్నవి.

ఏకోవశీ సర్వభూతాంతరాత్మా (కఠోపనిషత్తు) ఏకోబ హూనామ్ (కఠ) ఏకమేవాద్వయంబ్రహ్మ (అధ్యాత్మోపనిషత్తు). ఏకోదేవోబహుధానివిష్టః (ముద్గలోపనిషత్తు). ఏక ఏవహి భూతాత్మా భూతేభూతే వ్యవస్థితః (త్రిపురాతాపిన్యుపనిషత్తు) ఏకమేవతత్పరం బ్రహ్మవిభూతి నిర్వాణం (బ్రహ్మోపనిషత్తు) ఏకోనారాయణః నద్వితీయోస్తి కశ్చిత్ (నారాయణోపనిషత్తు) దేవ ఏకోనారాయణః (సుబాలోపనిషత్తు) ఏక ఏవశివోనిత్యస్తతోన్యత్ సకలంమృషా (శరభోపనిషత్తు) ఏకోహిరుద్రో నద్వితీయాయతస్థుః (శ్వేతాశ్వతరోపనిషత్తు)ఏక ఏవాద్వయఃతథా (ఆత్మోపనిషత్తు) ఇట్టియుపనిషద్వాక్య రత్నములు లెక్కకుమిక్కిలిగాఁగలవు.