182
ఉపన్యాసపయోనిధి.
ఏకేశ్వరవాదము.
ఏకేశ్వరవాదము (Monotheism) మనమతమునందు లేదనియు మనమతము పలుదైవతములను దెలుపు చున్నదనియు మనమతగ్రంధము లెన్నడును గని విని యెఱుంగని నవమేధావులు పలువురు తలంచుచున్నారు. అంతియకాక క్రీస్తుమత వికారమని చెప్పఁదగిన బ్రహ్మసమాజ మతమూలముగా నిప్పిడిప్పు డేకేశ్వరవాదము మనదేశమున ప్రారంభమైనదని తలంచు బుద్ధిమంతులుకూడఁ బెక్కురు కలరుకాని యీతలంపు వట్టియజ్ఞానవిలసితము. మనమతగ్రంధముల నించుకయైనం జదివియున్నవారెవరును ఇట్టివింత తలంపుల నందఁజాలరు. వేదాది పురాణాంతమునుగూడ మనమత మేకేశ్వరవాదమును జేయుచున్నదని బుద్దిమంతులెల్లరు నెఱింగినవిషయమేకదా. ఈవిషయమై పాశ్చాత్య పండితమండలితలంపుకూడ నీవిధముగానే యున్నది. ఇందునుగూర్చి మోనియరు విలియమ్సు దొరవారిట్లువ్రాసియున్నారు.
"It is a mistake to suppose that the first introduction of Theism into India was due to the founders of the Bramha Samaj. Some of the oldest hymns of the Rig-veda are monotheistic, and all the most pronounced forms of India pantheism rest in the