ఈ పుటను అచ్చుదిద్దలేదు
బాలురు (విద్యార్ధులు) వేదాంతము. 181 మారాధనము మొదలాత్మా రాధనము వఱకు నన్ని సాధన ములను హిందూమత మంగీకరించుచున్నది. బాలురు అసిధారాసమ మనియు చెప్పందగిన రాజకీయ వ్యాపారములందుఁ బ్రవేశింపవచ్చునని యిప్పటిమనులు ను డువుచున్నారు. అగ్నిహోత్రతుల్య మని చెప్పనొప్పు సాంఘి కవ్యవహారములందు బాలురు చొరవచ్చునని యిప్పటి ప్రణు ర్థులు వలుకు చున్నారు కానిసుజ్ఞాన దాయకమగు వేదాంత ము నభ్యసింప రాదంట! మేలు ! మేలు ! లోకమా, యేలవే దాంతవిషయమై యీ కారణము లేనిభీతి? ఏలజంకు ? భయ మువిడచియందఱును దగురీతిని వినిర్మలమైన వేదాంతమును దెలిసికొని బాగు పడుదురు గాళ, 'ఆ॥ వినుఁడు నాదుపలుకు విశ్వసించితిరేని సతులకైన బాలజనులకైనఁ దెలియవచ్చు మేలు దేహాద్యలంకార దళన నిపుణమైన తపసిమతము అనిష్ప్రహ్లాదుఁడు నచించిన వాక్యములనందఱుఁ దెలిసికొం దురు గాక.