178
ఉపన్యాసపయోనిధి.
వాఁడు” అనియు “విష్ణుఁడింతయుకాని వేఱొండులేదని యొత్తిలినగుచుండు నొక్కచోట" అనియుఁ జెప్పఁబడియున్న వాక్యములను బట్టిచూచిన నాతఁడు వట్టిభక్తుఁడేకాక జ్ఞాని యనికూడనవి దెలుపుచున్నవి. అంతియకాక ప్రహ్లాదునకుఁజిన్నతనముననే వైరాగ్యబోధకూడ గావింపఁబడినది, అందుమూలముచేతనే "సంసారనివృత్తుండు" "విశ్వమందుగన్న విన్న యర్ధములందు, వస్తుదృష్టిఁజేసి వాంఛయిడఁడు" మున్నగులక్షణములు తెలుపఁబడినవి. పైఁగా "చ॥ ఎల్లశరీరధారులకు నిల్లనుచీఁకటి నూతిలోపలం। ద్రెళ్ళక మీరునేమనిమతిభ్రమణంబున ఖిన్ను లై ప్రవ। ర్తిల్లక సర్వమున్నతని దివ్యకళామయ మంచు విష్ణునం। దుల్లముజేర్చి తారడవి నుండుటమేలు నిశాచరాగ్రణీ” అనిప్ర్రహ్లాదుఁడు పలికినపలుకులు వైరాగ్యప్రధానుఁడగు పరమ వేదాంతియని బోధించుచున్నవి. సర్వజనులందును భ్రాతృభావమును గలిగించి సద్గుణంబుల వెలయింపఁ జేయునది వేదాంత జ్ఞానమేకాని మఱియొక్కటి కానేరదు. సర్వమును భగవత్స్వ రూపమేయను తలంపే సర్వభ్రాతృభావమును (Universal brotherhood) గలిగించునని వివేకానందస్వామి మోక్షమాలరు భట్టాచార్యులు మున్నగువారు చెప్పియున్నారు. ఆరీతినే మహ్లాదుఁడును “అవికల్పితుఁడునని ర్దేశ్యుండును నయిన పరమేశ్వరుండు త్రిగుణాత్మకం బయిన తన దివ్యమాయ చేత నంతర్హితైశ్వర్యుండై వ్యాప్యవ్యాపక రూపంబులంజేసి దృశ్యుండును ద్రష్టయు భోగ్యుండును భో