బాలురు (విద్యార్థులు) వేదాంతము.
177
కును గూడదేమోగాని యుత్తమములయిన మతసిద్ధాంతము లివియని యందఱకును దెలిసియుండవలసినదె.
"If I had a child I would from its very birth begin to tell it "thou art the Pure one"
(నాకొక్కశిశువుండిన నాశిశువునకుఁ పుట్టినప్పటినుండి 'నీవావినిర్మలాత్మవ'ని బోధించియుందును) అని వివేకానందస్వాములవారు నుడివిరి. మదాలస తనచంటిపిల్లను తొట్టిలోపరుండఁబెట్టి యూచుచు “నీవేపరిశుద్ధము, నిష్కళంకము, పాపరహితము, సర్వశక్తిసంపన్నమునగు నాత్మవ'నిపాటపాడినది కాదా? నారదుఁడు ప్రహ్లాదునకు గర్భమందుండగనే తత్త్వోపదేశము చేసినట్లు గ్రంధములు ఘోషించుటలేదా ! ఇంతియకాక పితాపుత్రసంవాదాదులలో తండ్రులకు సుతులే వేదాంతబోధ చేసినట్లు పురాణములు చాటుచుండలేదా? “భృగుర్వైవారుణిః వరుణం పితరమువససార । అధీహిభగవోబ్రహ్మెతి" అను వేదవాక్యములలో పుత్త్రుఁడగు భృగువుతండ్రియగు వరుణునికడకుఁబోయి నాకు బ్రహ్మోపదేశము చేయుమని కోరినట్లు చేసినట్లును వర్ణింపఁబడియుండలేదా ? ఇట్టి యుదాహరణములు వేనవేలు కలవు. వటువులు పిన్నవయసుననేకదా బ్రహ్మోపదేశము చేయఁబడుదురు. సభాధ్యక్షులచే నాడుదహరింపఁబడిన ప్రహ్లాదుఁడు జ్ఞానియగుటయేగాక విరాగికూడనై యున్నాఁడు. “తనయందు నిఖిల భూతములందు నొకభంగి సమవర్తనంబున జరుగు