Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

ఉపన్యాసపయోనిధి.

he will be a better lawyer, and so on, and the result will be that the castes will remain for ever.”

ఈ (మత) సిద్ధాంతములు బయలువెడలి వనములలో మాత్రము నిలువవలసినవికావు పర్వతగుహలలోకి మాత్రమే పోవలసినవికావు అయ్యవి సభలకు రచ్చలకు చత్వరములకు బీదలకుటీరములకును కూడ వచ్చి పనిచేయవలెను చేపలను బట్టుకొను పల్లెవాండ్రకును జదువుకొను విద్యార్థులకు కూడ నవి యవసరమె. ప్రతిపురుషునకు స్త్రీకి బాలునకుఁగూడ వార లేవృత్తియందున్నను నయ్యవి యనుసంధించును. అవిఅంతటను నుండవలెను. భయ మెందుకు! ఉపనిషత్తత్వము లెక్కడ! వానినిపల్లెవాండ్రు మొదలగు వారాచరించుట యెక్కడ! అనియా? దానికి మార్గముచూపఁబడినది. అయ్యదిఅనంతము. మత మపారము. దాని నతిక్రమించి యెవ్వరు నుండఁజాలరు. అందునుగూర్చి మీరేమి యొనర్చిన నదిమీకు మంచిదియే, అత్యల్పక్రియకూడ అత్యద్భుతఫలము నొసంగును. కాన నెల్లరు తమయోపినమట్టుకు పనిచేయవలసినదే. నేనాత్మ స్వరూపుఁడనని పల్లెవాఁ డనుకొనిన వాఁడు మంచిపల్లెవాఁడగును. నేనాత్మస్వరూపుఁడనని విద్యార్ధి యనుకొనిన వాఁడు మంచివిద్యార్ధియగును &c.)

వివేకానందస్వాములవారు చెప్పిన పై వాక్యములు మిగులసముచితములయి యున్నవి. శుద్థవైరాగ్యబోధ యందఱ