పుట:Upanyaasapayoonidhi (1911).pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ష్ణాదులను గూర్చి భాష్యములలో శ్రీశంకర భగవత్పాదులవారును నీరీతినెయ సత్యములను వ్రాసిరి. ఇంద్రియగోచరములగు విషయములని మనము తలంచు వానివిషయములో నేమనయింద్రియములు మనకు యధార్ధ జ్ఞానము కలిగింప లేక యున్నప్పు డతీంద్రియములగు భగవదాదులనుగూర్చియవిమనకేమి సాహాయ్యమొనరింపగలవు? ఏమియు జేయజాలవు. కావున అతీంద్రియము లగు నాధ్యాత్మిక విషయములలో నాప్తవాక్యములగు వేదములే పరమ ప్రమాణము. 'ప్రత్యక్షేనానుమిత్యావాయోనవిద్యతే ఏతంవిధంతి వేదేవతస్మాద్వెదస్య వేదతా, అనివేదమును ' మనపెద్దలు నిర్వచించిరి. ప్రత్యక్షముచేతగాని అనుమానము ఛేతగాని ఎవరి గ్రహింపజాలమో వానిని దెల్పునది. కావున వేదమునకు వేదమని పేరువచ్చినది. అనితత్పర్యము. కాబట్టి శబ్దప్రమాణమే యుత్తమము.

                                   *

బాలురు (విద్యార్ధులు) వేదాంతము

 మాపురమునంగల కలాశాలావిద్యార్ధుల చే స్థాపింపబడిన "హిందూమత బాలసమాజం యొక్క సాంవత్సరి కోత్సవము 1903 సెప్టెంబరులోకడువైభముగా జరుపబడినది.