Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

ఉపన్యాసపయోనిధి.

లోకపిత, మనము వానిపుత్రులము. ఇందులకాస్తికులైన వారందఱును అంగీకరించుచునేయున్నారు. ఇఁకతండ్రి దొక జాతియు బుత్రునిదొకజాతియు నగునాయని మాత్రమాలోచించు కొనజాలనివారు పలువురు కలరని చెప్పవలసి వచ్చినందుకుఁ జాలవిచారముగానున్నది. భ్రమరములు విచిత్రతరములైన వర్ణములుగల పక్షములుగలిగి ఎగిరి పూలపైవ్రాలి మధువానిమనోహరముగా సంచరించు నున్న తావస్థయందుండఁగా వానిసంతతియేయైన గొంగళిపురుగులు సర్వవిధములనీచస్థితియందున్నవి. ఇవివాని సంతతియని చెప్పరానంత యధోగతియందు గొంగళిపురువులున్నవి. అట్టిస్థితియందే మనుజుఁడును నున్నాఁడు. ఈతఁడుసర్వజ్ఞుఁడైన దేవునిపుత్రుఁడే యైనను దానుకించిద్ జ్ఞుఁడైయున్నాడు. రానురాను కీటము భ్రమరమగునట్లెమనుజుఁడు రానురాను దైవమగును, ఎందుమూలముచేతను? ఒకటియేజాతిగనుక నరుఁడు దేవుని పుత్రుడనునది వట్టియలంకారముకాని జాతిసామ్యమును దెలుపునది కాదందురేని మనుజునందు దేవత్వముకలదనియు దాని నిగ్రమక్రమముగా వృద్ధివఱచుకొనవలెననియు నద్వైతవిరోధులుగూడఁ జెప్పుచునేయున్నారు. కావున మనుజుఁడు దేవునిపుత్రుఁడనుట వట్టియలంకారము కాదని యందఱును నంగీకరింపఁదగినదై యున్నది. కాబట్టి నామరూపాది భేధములున్నను గొంగళిపురుగు భ్రమరజాతి దేయైయుండి క్రమ క్రమముగా భ్రమరమెట్లగుచున్నదోయట్లె మనుజుఁడునామ