Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భ్రమరకీటన్యాయము.

165

మరూప భేదముగల గొంగలి పురుగులోనుండి పుట్టుచున్నది. గొంగలిపురుగు భ్రమరముకంటె విజాతీయమైనదిగాఁ బైకి గాన్పించినను నిజముచేనట్టిదికాదు. చూడనసహ్యముగానుండు గొంగళిపురువులు పూలపొదలపై బొదలుచుఁ గనులపండువొనర్చుచుండు సీతాకోకచిలుకల సంతతియే. భ్రమరములపిల్లలే గొంగళిపురువులు. సీతాకోకచిలుకలు చెట్లయాకులపై సన్నగ్రుడ్లను బెట్టును. ముత్తెపుపొడుములాగుననుండు నీగ్రుడ్లనుండి చిన్న పురువులుపుట్టును. వానిపై నచిరకాలములోనే రోమములు పెరుగును ఆపై కొంతకాలమువఱకుఁ జూడనొడలు కంపించురీతి బొచ్చుతో నీపురువులు నిండియుండును. ఇవిమరలచూడ్కులకు వేడ్కలుగూర్చు (భ్రమరకీటములుగా మఱికొంతకాలములో మాఱిపోవును. కావున జూడ రోతనుపుట్టించు గొంగళిపురుగులు లోచన లోభనీయముగా నుండు భ్రమరమును నొక్కజాతివియే. ఒక్క జాతివననేల గొంగళిపురువులే భ్రమరములు. భ్రమరములేగొంగళి పురువులు. మొదటియవస్థయందు గొంగళిపురువుగానున్నవే తుదకు సీతాకోక చిలుక లగుచున్నవి. ఆరీతినే మనుజుఁడు భగవంతుడగుచున్నాఁడు. భ్రమరమునకునుగీటమును జాతీయందు భేదముకలదని సూక్ష్మదృష్టిలేనివారు తలంచినట్లె మనుజునకు దేవునకును జాతీయందు భేదముకలదని దూరదృష్టిలేనివారు తలంచుచున్నారు. విజ్ఞులు నరుని దేవుని పుత్రునిగాఁ దలంచుచునేయున్నారుకదా! భగవంతుఁడు మనకు తండ్రి