Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

ఉపన్యాసపయోనిధి.

భ్రమరకీటన్యాయము

లోకమును భ్రమింపఁజేయుచున్న విషయములలో "భ్రమరకీటన్యాయ” మొక్కటి. కీటముభ్రమరమేరీతి నగుచున్నదో యారీతిని మనుజుఁడు దైవమగునని మనవారు చెప్పుచున్నారు. మనుజుఁడు కించిద్‌జ్ఞుఁడు. దైవముసర్వజ్ఞుఁడు నరుఁడుస్వల్పసామర్ధ్యముగలవాఁడు. భగవంతుఁడు సర్వశక్తి సంపన్నుఁడు. ఇట్లుండఁగా నరుఁడుదైవమగుట యెట్లు సంభవించుననఁగా భ్రమరకీటన్యాయముగా మానవుఁడు దైవమగుననివిజ్ఞులు చెప్పుదురు. కావున వేదాంతరహస్యార్ధపేటికకు నీభ్రమరకీటన్యాయమునుంచి బీగమైయున్నది. కావున దీనినిగూర్చి బాగుగాఁ జర్చించుకొన వలసియున్నది. భ్రమరము తనజాతితో సంబంధములేని యొకపురుగును దెచ్చి తనగూటిలోఁబెట్టి దానినిభ్రమరముగాఁ జేయునని కొందఱు చెప్పుచున్నారు. మఱికొందఱిట్టిపని జరుగదని త్రోసివేయుచున్నారు. భ్రమరము విజాతీయమైన పురుగునుదెచ్చి తనజాతిలోనికి మార్చుచున్నదని తలంచుట వెఱ్ఱితనమునకు సందియములేదుకాని యంతమాత్రముచే భ్రమరకీటన్యాయమును ద్రోసివేయుట యుచితముకాదు. ఎందుమూలము చేత ననఁగా కీటము భ్రమరమగుట మనము కన్నులార చూచుచునే యున్నారము. భ్రమరకీటమనఁగా సీతాకోకచిలుక. ఇయ్యదినా