156
ఉపన్యాసపయోనిధి
హ్యప్రపంచము మిధ్యయనుకొనుటకుఁ గారణమేమి? తమలో నున్న జ్ఞానతేజస్సుయొక్క మహిమకారణముకదా. అనఁగా జ్ఞాన తేజస్సుయొక్క మహిమ యెట్లు ప్రకాశించు చున్నదనఁగా నదికలవారిని భ్రమలో ద్రోయుచున్న దనవలెను. ఇది జ్ఞానతేజస్సును మహిమయు నగునా? కాన మనవారు నరునిలోని జ్ఞాన తేజస్సుయొక్క మహిమచేత బాహ్య ప్రపంచము కాన్పించక పోవునని వ్రాయుట యుచితముగానే యున్నదిగాని మరల బాహ్య ప్రపంచము మిధ్య కాదనుట యుక్తియుక్తముకాదు. ఈమనవారు బ్రహ్మమును సత్యము. జగమును సత్యమని తలంచు చున్నారు. ఇదిపొసఁగ నేరదు. బాగుగా నాలోచించి చూచినరెండు సత్యములుండ నేరవు. బ్రహ్మము వినాగా జగత్తు నందు సత్యముకలదా ! కలదనిమన పండితుల వారనఁ జాలరు. జగత్తు వినాగా బ్రహ్మము నందు సత్యత కలదా? కలదని మనవా రంగీకరింతురు. ఇఁక జగత్తునకుఁ బ్రత్యేకముగా సత్యతయేది? జగత్తుసృష్టి యందురా? పరిణామ మందురా? సృష్టియని ప్రాజ్ఞు లెవ్వరును గూడ నిప్పుడంగీ కరించుట లేదు. "The current idea that God created the world out of nothing can, strictly speaking, mean nothing else than that nothing can ever exist by the side of God, that God, out of his own energy supplied both the material & the efficient cause of the world" ఏమియును లేనిదానినుండిభగవంతుఁడు జగత్తునుసృష్టించినాడఁని సా