Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

ఉపన్యాసపయోనిధి

భావమునుండియేదియునుపుట్టదు.) అనిహూణశాస్త్రజ్ఞులును నొక్కివక్కాణించుచున్నారు. కావునశాస్త్ర సిద్ధమైన పరిణమవాదమే నిలుచునుగాని లోకసామాన్యము తలంచు సృష్టి మతమునిలువఁ జాలదు.

పరిణామముచే ప్రపంచము గలిగినదనిన బ్రహ్మమే ప్రపంచముగా మారినాఁడని యర్థమగును. అభావమునుండి భగవంతుఁడు ప్రపంచమును సృజించినాఁడనినను నిదియేభావము కాక తప్పదని విజ్ఞులు చెప్పుచున్నారు.

"Strange as Samkara's monism may seem to us yet the current idea that God created the world out of nothing can, strictly speaking mean nothing else than that nothing can ever exist by the side of God, that God, out of his own Energy, supplied both the material and the efficient cause of the world." (శంకరుని అద్వైతము మనకు వింతగాఁ గాన్పించినప్పటికి ఆభావమునుండి భగవంతుఁడు ప్రపంచమును సృజించినాఁడను లోకోక్తికి బాగుగానాలోచించి చూచిన నీప్రపంచమునకు భగవంతుఁడె కారణమును గార్యమును నై యున్నాఁడు. అనఁగా జగత్తునకు నుపాదాన కారణమును నిమిత్తకారణమును నై యున్నాఁడనుటకంటె వేఱుభావముకాదు) అని మాక్సుమూలరుదొరవారు వ్రాయించియున్నారు. కావున కుమ్మరవాఁడు కుండనుచేసినట్లు ప్రపంచమును భగవంతుఁడు చేయలేదనియు ప్రపంచమంతయు భగవన్మమయ