Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈశ్వరమాయ.

141

అతనిమాయ అళీకతకాదు. ఈప్రపంచమును బరిణమింపఁజేయ భగవంతుని యందు లీనమైయున్న సత్యమైనశక్తియే) అని ఎన్. రామానుజాచారి ఎమ్. ఏ. గారు వ్రాసినారు. "Maya pertains to Brahman, and it is a real power immanent in God, with the help of which, he is able to produce the world" (మాయ బ్రహ్మసంబంధమైనది. అదిభగవంతునియందు లీనమైయున్న సత్యమైనశక్తి దాని సహాయముచే నాతఁడు ప్రపంచమును సృజించుచున్నాఁడు) అని బ్రహ్మవాదియను పత్రికయందు వ్రాయఁబడియున్నది. "A power dependent for its existence on the Thing-in-selt of the Universe, the power is responsible for the projection of the appearances known as mind and matter out of the "unknown" అని స్వరూపానంద స్వాముల వారును మాయ యన నీశ్వరశక్తియని తెలిపియున్నారు. నేనీవఱకు హూణభాషలోనున్న వాక్యములనే ప్రమాణముగా నిచ్చియున్నాను. మనపరార్ధవరులీకాలపు బ్రహ్మవాదము హూణభాషను జరిగినగాని యార్షసమ్మతము కానేరదాయని యధిక్షేపింతు రేమో కానిండు. ఇక్కాలపు టార్యసంతతులు పలువురు హూణభాషలో నున్న దానినే యెక్కుడుగా గౌరవించుచుండుటచే నీరీతిని వ్రాయవలసివచ్చినది గాని మనభాషలలో మనపెద్ద లెవ్వరును నీరీతిగా వ్రాసియుండక పోవుటచేతగాదు. మనవేదాంతగ్రంధములందు 'మాయ' యనశక్తియని తెలుపఁబడియున్నది. కావుననేపైను