Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

ఉపన్యాసపయోనిధి

మాయయన శక్తివంటిసృజించు సామర్ధ్యము అను నర్థమిచ్చుచున్నది.) అని మాక్సుమూలరు దొరవారు వ్రాసియున్నారు. మాయయన శూన్యమనుభావము వేదాంతమునందు లేదని కోల్‌బ్రూక్కు దొరవారు వ్రాయించియున్నారు. ఇందుకుఁ బ్రమాణముగా మాక్సుమూలరు దొరవారు మున్నగువారినిచ్చుటను జూచి మనదేశక్షేమంకరులు ఇప్పటి బ్రహ్మవాదమనకు హూణులు ప్రమాణపురుషులాయని యడుగవత్తురు. ఎవరికేది యభిమాన విషయముగా నుండునో వారిని దానికి సాక్షులనుగాఁదీసికొంటకంటె యావిషయమును గూర్చి యితరులేమి తలంచుచున్నారో యదితెల్పిన నయ్యది యెక్కుడు బలవత్తరముగా నుండునుగాన విదేశస్థు లును విశేషజ్ఞులును నగు నీదొరల యభిప్రాయమును ముందు తెల్పినాను. మన దేశపు ప్రాజ్ఞులును "మాయ” యన నీశ్వరశక్తి యనియే వ్రాసి యున్నారు. "Maya is the creating power of the eternal God and consiquently it is diclared by the Vedant to be eter-nal" (ఆద్యంతర హితుఁడైన భగవంతుని సర్జన శక్తియే మాయయైయున్నది. అందుచే వేదాంతమునం దదియును ఆధ్యంత రహితమని తెల్పఁ బడి యున్నది.) అని రాజా రామ మోహనరాయల వారు వ్రాసి యున్నారు. "His Maya is no illusion, but a real power immanent in Paramatman which enables Him to evolve this Universe &c,"