ఈశ్వరమాయ.
139
"మాయ" నుగూర్చి చెప్పుచున్న దొకటియును అజ్ఞులుదానినిగూర్చి గ్రహించుచున్న దొకటియు నై యున్నది.
వేదాంతము 'మాయ' యననేమి చెప్పుచున్నదనఁగా భగవంతునిశక్తియని తెలుపుచున్నది. అంతియేకాని లోకులు తలంచినట్లు శూన్యమనిగాని అజ్ఞానమనికాని మోసమనికాని తుదకవిద్యయనికాని యర్థముకాదు. "The very word Maya never occurs in the principal Upanishads in the same sense as Avidya. It begins to show in the Svetasvatara Upanishad, which held a position of its own. This is surely an important fact, and as we now possess Colonel Jacob's concordance, we can assert it with perfect confidence. When Maya occurs once in the plural, in the Brihad, Ar. Upanished 11, 5, 19, this is really a quotation from the Rig-Veda VI, 47, 18, and shows how Maya, in the sense of Sakti, power, came to find its way into the language of the Vedanta. In compound words also, Maya generally means power, creative power, very much like Sakti” (ప్రధానోపనిషత్తులలో నెచ్చటను అవిద్యయను నర్ధమున మాయ యనుపదము వాడఁబడియుండలేదు. ఋగ్వేదములోనుండి బృహదారణ్య కోపనిషత్తులో నీమాయ బహువచనముగా వాడఁబడియున్నది. ఇది వేదాంతపరిభాషలో "శక్తి" యనునర్థముననెట్లు “మాయ” యనుపదము వాడుకలోనికి వచ్చినదో తెలియఁజేయుచున్నది. సమాసములందుఁ గూడ.