138
ఉపన్యాసపయోనిధి
గానులాభకరమైనది హానికరమైనదిగాను హానికరమైనదిలాభకరమైనదిగాను, సౌఖ్యమును అసౌఖ్యముగాను అసౌఖ్యమును సౌఖ్యమునుగాను గ్రహించుచుండును. కావున దేశ క్షేమముకోరువారు లోకులయజ్ఞానమును దొలఁగింప సాధ్యమయినంత వఱకుఁ బ్రయత్నింపవలయును. అందులో ముందు ప్రథాన విషయములందు లోకులకుఁగల యజ్ఞానమును దొలఁగించుటకు ముఖ్యముగాఁ బ్రయత్నించుట యుచితము. వేదాంతుల భూమి (Land of Philosophers) యైయున్న యీభారతవర్షమునందు మిక్కిలి ప్రధానమైనది వేదాంతము. ఇది బాగుగాఁ తెలిసికొనినవారి కమితమగు సాహాయ్యము నొనర్చునదియైయున్నది. కానిలోకులు కొందఱజ్ఞానముచే నియ్యది దేశమునకు హానిని గలిగించునది యనుతలంపు నకు లోనై దానినుండి విముఖులగుచున్నారు. మఱికొందఱు వేదాంత విషయములంగూర్చి తప్పుటూహలనంది నిజముగాఁ జెడుస్థితికివచ్చుచున్నారు. దీనికంతకును అజ్ఞానము మూలముగాని వేదాంతము మూలముకాదు. కాఁబట్టిలోకులే వేదాంతవిషయములంగూర్చి తప్పుటూహలఁ బడుచున్నారో యావిషయములనొక్క టొక్కటే తీసికొని విషయ విమర్శనము చేయుదము.
లోకమునుదప్పుటూహలలోఁ బెట్టుచున్న వేదాంతవిషయములలో "మాయ" మొదటిది. నిక్కమగు వేదాంతము