Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

ఉపన్యాసపయోనిధి

గుటకై యాత్మను గూర్చి వారు వ్రాసియుంచిన తల్లక్షణము లను గూర్చి విచారింతము.

ఆత్మలక్షణములు.

“ఆపక్షమునను మరలమరలఁ దొల్లింటియాత్మలే జన్మిం చుచుండుట కవకాశము కనఁబడక క్రొత్త యాత్మలే వుట్టు చున్నట్టు స్థిరపడుచున్నది.” (సంపుట16) అను పంతుల వారి వాక్యములవలన ఆత్మకుఁ బుట్టుకకలదని తెలియవచ్చు చున్నది. ఇంకను “ఆత్మయందేమియును భాగములు కనఁబడ పు గనుక భాగములు లేనివానికి నాశనము కలుగుట యసం దర్భముగనుకను ఆత్మనిత్యమయినదని యూహింపఁ దగియు న్నది. (సం-8 పుట-162) అనుమాటవలనమరలనాత్మ నిత్య మైనదని తేలుచున్నది. ఇది యసంగతము కదా? నిత్యమన గా నెల్లప్పుడు నుండునదియని యర్ధము. శ్రీపంతులవారు (సం-9 పుట-154) లో భగవంతుఁడు నిత్యుఁడని వ్రాసిరి. ఆనిత్యత్వమును ఆత్మయొక్క నిత్యత్వము వంటిదేయగునా? ఒకప్పుడు పుట్టిన దానిని నిత్య మనుట యెట్లు: ఆదియె ట్లొ నిత్యము కాఁగలదు. " జాతస్య మరణంధృవ మ్మనియు "పుట్టుట గిట్టుటకొఱకే యనియు Every beginning must have an end" అనియుఁ గోవిదులువక్కా ణింతురు గదా. కాననాత్మకుఁ బుట్టుక యున్న యెడల నాశ వమును నుండితీరవలెను. శ్రీపంతులవారు లోకవిరుద్ధమైన