వీరేశలింగం పంతులు గారి యాత్మజ్ఞానము.
212
చున్నాఁడు. కావున నే మనోనిగ్రహమును జేయవలెను. మ నన్సును వశవఱచు కొనవలెను. మున్నగుబోధలు విజ్ఞులు చే యుచున్నారు. తానేమనస్సయినయెడల మనస్సును దాను వశపఱచు కొనుట యెట్లు? అందేమి యర్థముండగలదు. “మనగట్టితనమంతయు దూరముగానుండి నీతులు చెప్పువఱ కే సాగునుగాని మనమనస్సు నొక్కసారి యా ప్రక్కకుపో నిచ్చిన యెడల” (సం 7 పుట 285) అను వాక్యములందు మ నస్సును మనము నడుపుటను గూర్చి శ్రీపంతుల వారు ముచ్చ టించి యున్నారు. "పర్వతము సముద్రమునందు తేలుట యెంతయసాధ్యమో సంసారములోనున్న వారు చక్కని స్త్రీ ని చూచినప్పుడు మనస్సునుని గ్రహింపఁగలుగుట యంత య సాధ్యమని యాకవి సార్వభౌముని తాత్పర్యము (సం 7 పుట 286) అనువాక్యములందు శ్రీపంతులవారు మనుజులు మనస్సును నిగ్రహించుటను గూర్చి ముచ్చటించి యుండిరి. మఱియు ' మనమనస్సులు కూడ నొక వేళ చలింప వచ్చు ను గనుక ముందుగా చెడు మార్గమునఁ బ్రవేశించుట కవకాశ మిచ్చి యందు ప్రవేశించిన తర్వాత వానితో ( మన మనస్సులతో) పోరాడి కష్టము మీఁద మరలించుటకు ప్రయత్నించుటకంటె ప్రప్రధమముననే యామార్గ మును మూసివేయుట మనకయిన నెంత క్షేమకరము! ఇట్లు మనము మనస్సులతోఁబోరాడి వానిని మనవశము చేసికొ నుచున్నామను సంగతిని పంతుల వారు వ్రాయించియున్నారు.