Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

ఉపన్యాసపయోనిధి

ణము ( ఇంద్రియము ) గాఁ బంతుల వారు స్వహస్తము తో వ్రాయించి యున్నారు. ఆత్మకు సాధనమయిన యిం ద్రియమెప్పుడైన నాత్మయే కాఁగలదా ? కాదు. అట్లయిన నేత్రాదులును ఆత్మలే కావలసి వచ్చును గదా. కాఁబట్టి యా త్మ యవయవికానియవయవము కాదు. ఇంకను “ఆలోచన యు నుద్దేశమును ఎప్పుడును బుద్ధి యొక్కయు మనస్సు యొ క్కయు పనులు కాబట్టియాఁతడు ఆత్మస్వరూపుడై నట్టు స్పష్ట మగుచున్నది” (సం 8 పుట 165) అను దానివలన బుద్ధియుమన స్సును ఆత్మయైనట్లు గాన్పించుచున్నది. అట్లనుటకు వలనువ డదు. “ బుద్ధినిమించిన సాధనము వేఱొకటి లేదు” (సం.8 పుట 168) “ కాఁబట్టి యీశ్వర జ్ఞానమును బొందుటకు బు ద్ధియు, సృష్టియు నీరెండును మాత్రమే మహాసాధనములు సం.8 పుట 174) అనురీతిగా పంతులవారు పలు తావుల వ్రాసి యుండుటచే మనస్సు సాధనమని వారివ్రాతల వల నఁగూడఁ దెలియవచ్చుచున్నది. ఎవరికి సాధనము ? ఆత్మ కు. కాన ఆత్మ వేఱు దాని సాధనమైన మనస్సు వేఱు అని చెప్ప వలెను. ఇంక మనుజుఁడు 'నామనస్సు' అని తాను వేఱును తనమ నస్సు వేఱునై యున్నట్లు మాటలాడుటయ కాక తనకు మ నస్సునొక కరణముగా నెంచుటయకాక తాను మనస్సునకొ కప్పుడు లొంగిపోవుచున్నట్టు మఱియొకప్పుడు దానిని దనవ శము చేసికొని నిగ్రహించుచున్నట్టు అనుభవము చేఁ దెలిసికొను