Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116

ఉపన్యాస పయోనిధి

రావుబహదర్ వీరేశలింగం పంతులుగారి

యాత్మజ్ఞానము.

శ్రీరావుబహద్దరు కందుకూరి వీరేశలింగము పంతులుగారులోకమును దమ్ముననుకరింపఁ గోరికొనుచున్నారు. పలువురుపత్రికాధిపతులు శ్రీపంతులవారు మన దేశమునకు మార్గదర్శకులై యున్నారని నుడువుచున్నారు. బహుజనులు వారిని ప్రమాణముగాదీసికొనఁబోవుచున్నారు. ఇట్టివారియొక్క సామర్థ్య మెంతటిదో లోక మెఱింగియుండుట యవసరముకాదను బుద్దిమంతు లుండఁజాలరుకదా. కావున వీరి సామర్థ్యమునుగూర్చి లోకహితార్థమించుక వ్రాయుచున్నాఁడను. జ్ఞానములలోనెల్ల ఆత్మజ్ఞానము ముఖ్యమయినదని యందఱును అంగీకరించియున్నారు. ఆహేతువుచేతను ఈలోకమునకు బహూపకారకమై యాస్తిక్యమును గలిగించుచున్న విగ్రహారాధనమును బరిపరివిధముల నిందించి మిక్కిలి దుస్సాధ్యమయిన యాత్మజ్ఞానముకలవారికి నియమింపఁబడిన మానసికారాధనమునుసర్వత్ర యుంచవలెనని నొక్కి వక్కాణించుటచేతను బహుధర్మములను జక్కఁగా బోధించు జన్మాంతరాదులను దృణీకరించుచుండుటచేతను శ్రీ