Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రహ్మజ్ఞానము.

111

గుగాబోధించును. భక్తిలేమివిషయ విమర్శనమును హద్దు దాటించును. అందుమూలముచే కువాదములు బయలువెడలును. సద్భక్తిగలిగియుండుటకును లేకుండుటకును నిదియేభేదము. అందుమూలముచేతనే ముందుభక్తిని సంపాదించుకొనవలసినదని యన్నిమతముల వారును గూడఁ జెప్పుచుందురు.

బ్రహ్మజ్ఞానము కలుగుటయెట్లు? వేదములీవిషయమునఁ బరస్పరవిరుద్ధముగాఁబలుకుచున్నవి. ఒకచోట "యతోవాచో నివర్తింతే అప్ర్రావ్యమనసాసహ" (మనస్సుతోఁగూడ వాక్కు లెవనినుండి మరలిపోవుచున్నవో అనఁగా అవాఙ్మాన సగోచరుఁడు భగవంతుఁడు) అనితెలుపఁబడి యున్నది. ఇఁక నొకచోట 'బ్రహ్మవేదబ్రహ్మైవభవతి' (బ్రహ్మమును దెలిసికొని బ్రహ్మమేయగుచున్నాఁడు) అని తెలుపఁబడి యున్నది. ఇదియెట్లు పొసఁగును? అవాఙ్మానసగోచరునిదెలిసికొనుటయెట్లు? ఇదిపరస్పర విరుద్ధముకాదాయనియడిగిన నట్లు కాదు. స్థూలదృష్టిచేఁజూచిన నట్లుకాన్పించినను సూక్ష్మదృష్టిచేఁజూచిన నిందు సత్యమే కాన్పించుచున్నది. అది యెట్లనిన:-

“యతోవాచో నివర్తింతే అప్రాప్యమనసాసహ” మున్నగు శ్రుతివాక్యములు భగవంతుని బ్రకాశింపఁజేసి మనకుఁదెలియజూపు సాధనములేవియును లేవని తెలుపుచున్నవి. అట్లనమనము భగవంతుని తెలిసికొన లేమనుటకాదా?