Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

ఉపన్యాసపయోనిధి.

న్నారు. ఎవరిదోషములువారికిఁ దెలియుటలేదు. ఎందుమూలముచేత? తమతమ మతములందు తమకు భక్తి కలదు కావున.

తమయవస్థలీరీతి నున్నను గూడ నీయుభయ పక్షములవారును మరల హిందువుల పురాణములందున్న విషయముల నధిక్షేపించుటలోఁ దమ పాండిత్యమును సిగ్గువిడిచి చూపఁబోవుచున్నారు. ఎందుచేత? స్వవక్షమునందున్న భక్తిపరపక్షమునందు లేకపోవుటచేతనే. బైబిలునందు భక్తియుండుటచే క్రైస్తవునకు పరిశుద్ధాత్మ పరపురుషుని భార్యతో సంపర్కమును గలిగించుకొని గర్భమును నిలుపుట దోషముగాఁ గాన్పించినదికాదు. బైబిలునందు భక్తిలేకపోవుటచే రామమోహనరాయలవారి కయ్యదిదోషముగాఁ గాన్పించినది. మఱియును బ్రకృతియందు జారత్వాదిదోషములు మెండుగాఁ గాన్పించుచుండినను సర్వశక్తుఁడై యుండియు దానిని నివారింపక యుపేక్షించుచున్న దైవమును దోషిగానెన్నుటకు మాఱుగా బ్రాహ్మసామాజికులు సకలసద్గుణసమేతునిగా నాతని భావించుచున్నారు. ప్రకృతియందు భక్తిలేకపోవుటచే నితరులు దానియందు గాన్పించుదోషములను బట్టి భగవంతుని దోషిగా నెన్నుచున్నారు.

అట్లయిన భక్తిఁదోషమునుగుణముగా గ్రహించునట్లుచేయునా యన నట్లుగాదు. వివేకముతోఁగూడిన నిజమైనభక్తి యేయేవిషయము నెంతవఱకు గ్రహింపవలయునోబా