బ్రహ్మజ్ఞానము.
105
వింతపడనేల ? రోగమువలన నయమును భయమునుగలిగించు చున్నాఁడనియేలచెప్పరాదు? "పరులను నిష్కారణముగా బాధించుట దేవతాస్వభావమునకుఁ దగియుండునా” యని తలంచు వివేకి నరుల నిష్కారణముగా మృత్యుముఖమున వేయుట దేవతా స్వభావమనుకొనుట వివేకమా? లోకములో వివేకులగువా రేమి చెప్పుచున్నారు? ప్రజలను భయపెట్టి తనవశము చేసికొనవలెనని చూచువాఁడు అవివేకియుఁగ్రూరుఁడు ననియు జనులకు యుక్తాయుక్తపరిజ్ఞానము కలిగించిజ్ఞానమార్గమున లోకమును ధనవశము చేసికొనువాఁడు వివేకియనియుఁజెప్పుచున్నారు. కానభగవంతుఁడు పిడుగు మొదలగు వానిని గల్పించి ప్రజలందు భీతిని బుట్టించి తనవశము చేసికొనఁజూచుచున్నాఁడనిన క్రూరుఁడనియు నవివేకియనియుఁ దేలును.
మఱియును ఈబుద్ధిమంతుఁడు వ్రాసిన యీక్రింది వాక్యములంగనుఁడు.
"అంగహీనులును బలహీనులును స్వదోషమువలనగాక దైవవంచనముచేత పాటుపడలేక పోవుదురుగనుక అట్టివారికిదానముచేయుటయే మానవధర్మము.”
దీనివలన లోకములోఁ దా మేదోషమును జేయకపోయినను అంగహీనులు బలహీనులునైనవారు పలువురు కలరనియు వారిని దైవము వంచించినాఁడనియుఁ దేలుచున్నది. ఈవ్రాఁతవలన దైవమువంచకుఁడని తెలుపుటకేమైన సందియ