104
ఉపన్యాసపయోనిధి.
నధురీణా ! పిడుగు పాము మొదలయినవానిని జీవదయాపరుడు మనకు నీతిని బోధించుటకయియే సృజించినాఁడుగా! అయిన నవి పూజనీయములేకదా. మనకు నీతినిబోధింప నా లోకమునుండి యీలోకమునకు వచ్చిన యీసర్పాదులు మనకుఁ బూజనీయములెట్లు కాకుండును ? అయ్యా ! ఎవరికి నీతికఱవుటకు ? ప్రతివత్సరమును అవి నోటవేసికొనుచున్న యసంఖ్యాకులగు జనులకా ? మిగిలినవారికా? మొదటివారికనవారు మృతులేయైరి. ఇఁక వారికి చేయుబోధయేమున్నది? మిగిలినవారి కనపిడుగు మొత్తినవాని యవస్థనుజూచికాని పిడుగునుజూచిగానియేమినీతి గ్రహింపవలసియుండును? దుర్మార్గు లిట్లు నశింతురనియా? సన్మార్గులను పిడుగు మొత్తుటలేదో ? ఇఁక గ్రహింపవలసిన దేమున్నది? పాము, పిడుగు, భూకంపము, ప్రళయము మొదలయినవానినిఁ బంపి నిష్కారణముగా సన్మార్గులనుదుర్మార్గులను గూడ హటాత్తుగా నశింపఁజేయుచున్న వాఁడు దయామయుఁడెట్లు కాఁగలఁడు ? జ్ఞాననిథీ! ఒక్కమారుగా నసంఖ్యాకులగు జనుల రూపుమాపు ప్రళయముల సృజించినవాఁడు నయమును భయమును జూపి బిడ్డల సన్మార్గమునకు దింపు తండ్రివంటివాఁడా! నయమును భయమును గలుగుటకై బిడ్డలఁజంపివేసిన తండ్రియెచటనైనఁగలఁడా? ఎచ్చటనైననున్నవాఁడు బుద్ధిమంతుఁడని పలుకఁబడునా ? ఇట్టి వివేకముగల మహాజ్ఞాని దేవుఁడురోగములు దెచ్చిపెట్టుచున్నాఁడనిన నిఁక