100
ఉపన్యాసపయోనిధి.
మనమతగ్రంధములన్నియు భగవంతుఁడవాఙ్మానస గోచరుఁడని తెలుపుచున్నవి. పశ్చిమదేశమునందలి జ్ఞానులగు స్పెన్సరు మొదలగువారును అవిజ్ఞేయుఁడు (uuknowable) అని బోధించుచున్నారు. ఈవిషయమై సిసిరో యనుజ్ఞానియొకచిన్నకథను జెప్పియున్నాఁడు. దానినిట నుదహరించుట యనవసరము కాదు. ఒక ప్రభువు ఒక జ్ఞానినిజూచి భగవంతుడన నేమియని ప్రశ్నవేసియున్నాఁడు. జ్ఞాని యించుక యాలోచించి రేపుసమాథానము చెప్పెదననె. నాఁడు రేపు వచ్చినది. రాజుమరల తనప్రశ్నమువేసినాఁడు. జ్ఞాని రేపుచెప్పెదనని యుత్తరమిచ్చినాఁడు. ఇఁకనొక రేపువచ్చినది. మరల రాజుప్ర్రశ్నించినాఁడు. జ్ఞాని యెప్పటియట్ల రేపు చెప్పెదననియే బదులిడినాఁడు. ఈరీతిగా రేపులసంఖ్యాకములుగా జరిగిపోయినవి. నృపునకుఁ దొందరపుట్టినది. అప్పుడు జ్ఞాని ఱేనిఁజూచి "ఓరాజేంద్రా, నీవు మొదట ప్రశ్న వేసినప్పుడొక్కదినము బాగుగానాలోచించుకొనిన నీప్రశ్నకుసమాధానమీయఁగలుగుదు ననుకొంటి. అట్లాలోచించుటచే నిఁకనొకనాఁడు కావలసివచ్చినది. దానితరువాత వేఱొకనాడవసరమైనది. ఈరీతిగా నాలోచించినకొలఁది కాలము గతించుచున్నదేకాని భగవంతుఁ డిట్టివాఁడని తెలుపుటకుమాత్రము నాకుసందర్భము కుదురుకున్నది. ఆలోచించిన కొలఁది విషయము దూరముగాఁబోవుచున్నది. భగవంతునిమనము తెలిసికొనఁజాలమని తుదకు దోఁచుచున్నది” అని కడవటి