పుట:Upanyaasapayoonidhi (1911).pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రహ్మజ్ఞానము

    జ్ఞానములలో నెల్ల బ్రహ్మజ్ఞానము మిక్కిలి కఠినమైనది.  ఎందుచేతననగా జ్జెయమగు బ్రహ్మము అనంతమైనది. అట్టి యపారమగు బ్రహ్మమును దెలిసి కొనుటకుగల యాధారములు మిక్కిలి తక్కువ. అయున్నవైనను అల్పములు. కాన బ్రహ్మమును దెలిసికొనుట మునులకును దుఘన్ టమైయున్నది. ఎట్లన జూచి తెలిసికొందుమనిన.
                               "సతత్రచక్ష్యుర్గచ్చతి"
  అని వేదములు ఘోషించుచున్నట్లుగా మనదేష్టి యచటి కి బోనేరదు.  పోనిందు బాగుగా దెలిసికొనిన విజ్ఞలు వణిన్ంపగాఅ విని తెలిసికొందుమనిన.
                             "నజాగ్గచ్చతి"
  అని శృతులు మొఱలిడుచున్నట్లుగా నచటికి వాక్కులు పొనేరవు.  పోనిండు మనస్సుచే మాహింతుమనిన.
                                  "నమన:"
    అని యామ్నాయములు చాటుచున్నట్లుగా నచటికి మనస్సును బోనేరదు. ఇక నెట్లు తెలిసికొందుమనిన-
                                   "ననిజానీమ:"
 అనినిగమంబులు ప్రకటించునట్లుగా మనముభగవంతుని