96
ఉపన్యాసపయోనిధి.
ఈశ్వరునుండి వచ్చినపదార్ధము ఎప్పటికిని ననీశ్వర పదార్ధము గాఁజాలదుకదా? అగుననునెడఁ బులికి మేక పుట్టుననియు మామిడివిత్తువలన పనసచెట్టు పుట్టుననియుఁ గూడఁ జెప్పవచ్చునుగదా? అట్లు చెప్పఁగూడదని యందఱును నంగీకరించియున్నారుగాన నీశ్వరునుండి యనీశ్వర పదార్ధము కలుగుననుటకు వలనుబడదు. వీని నన్నిటిని గనియేకాఁబోలు ! పాపము! పంతులవారును నద్వైతమునుగూర్చి "శంకరాచార్యులు" అను వ్యాసములో నిట్లువ్రాయించియున్నారు.
"అద్వైతమతము యుక్తిచేత చక్కఁగానే కానఁబడినను అనుష్ఠానమునకు మాత్రమంతగా అర్హ మైనదికాదు'- పుట 501 సం॥ 8 పుట వంతులవా రద్వైతము యుక్తియుక్తమేయని యంగీకరించిరి కదా. ఇఁకదీని నధిక్షేపింపఁ బోనేల ? యుక్తియననేమో శ్రీ శ్రీపంతులవారేయిట్లు వ్రాయించియున్నారు.
“ఇంద్రియములకు గోచరములైన విషయములవలన మనము పొందిన యనుభవమును దెలియని విషయములయందుఁ జొప్పించి కార్యకారణ సంబంధముతో విమర్శించినమనకుఁ దోఁచునట్టి యభిప్రాయములు యుక్తులుగాని తద్భిన్నములైన వెల్లయుక్తులు కావుగదా.”
ఈనిర్వచనముంబట్టి యద్వైతము యుక్తి యుక్త మ ని పంతులవారు చెప్పిరన తమ యింద్రియములకు గోచరములై