అద్వైతము - తద్విరోధులు.
95
out of his own energy supplied both the meterial and the efficient cause of the world."
(శంకరుని యద్వైతము మనకెంత వింతగా కాన్పించినను భగవంతుఁడు శూన్యమునుండియే ప్రపంచమును సృజించినాఁడను లోకోక్తికి నిజము చెప్పవలసివచ్చునెడ భగవంతునికంటె భిన్నముగా నతనిముందఱ నేదియును లేదనియు భగవంతుఁడే యీప్రపంచమునకు కారణము. కార్యమునైనాఁడనియు నర్ధముచెప్పి తీరవలెను.) అనఁగాఁ దానే ప్రపంచమైనాడన్నమాట.
ఇందునుగూర్చి జస్టిసు మహాదేవగోవింద రెనడీగారిట్లు వ్రాసియున్నారు:-
"Material creation out of nothing is an impossible conception."
(ఈప్రపంచము శూన్యమునుండి సృజింపఁబడినదని తలంచుట యసాధ్యము)
ఈవిషయమై శ్రీవీరేశలింగము పంతుల వారును నిట్లు వ్రాసియున్నారు: --
"శూన్యమునుండి యెప్పుడును నొకవస్తువుపుట్టనేరదు”
కాననిప్పుడు ప్ర్రపంచమెట్లువచ్చినదన శూన్యమునుండి రాలేదనవలెను. మఱి దేనినుండి వచ్చినది? భగవంతునికంటె మఱియొకపదార్థము మొదట లేదుగాన నీప్రపంచమంతయును దేవునినుండియే వచ్చినదనవలెను.