90
ఉపన్యాసపయోనిధి.
శలింగముపంతులవారు లెస్సగా వ్రాయించియున్నారు. దీనినిబట్టి దేహవిశిష్టమైన మనుష్యాత్మ మృగత్వదేవత్వములుకలదనియుఁ దద్రహితమైన మనుష్యాత్మ కేవలదేవత్వము కలదనియు తేలుచున్నది. అనఁగా దేహవిముక్తి జెందిన మనుష్యాత్మకును బరమాత్మకును భేదములేదని స్పష్టమగుచున్నది. స్థూలదేహ రహితమైన మనుష్యాత్మను వీరిట్లు వర్ణించియున్నారు:— "అది (మనుష్యాత్మ) నిరవయవమయినదియు నిరాకారమయినదియుఁ గనుక నాశనరహితమైనది; అది స్వప్రకాశ మయినది గనుక జ్ఞానాత్మకమయినది కరుణాదిగుణవిశిష్టమయినది గనుక కారుణ్యమయమయినది ఇట్టిగుణములుగలయాత్మ సృష్టిలోని మఱియే పదార్థమునందును గానఁబడదు. ఈశ్వరుఁడొక్కఁడుమాత్రమే యిట్లాత్మ స్వరూపుడయియున్నాడు." దీనినిబట్టి పరమాత్మయందును మనుష్యాత్మయందును వస్తుతత్త్వమును బట్టి యేమియును భేదము లేదని తేలుచున్నది
ఇంకను నీయభినవ గుణసంపన్నుని మతమున ముక్తియననేమో తెలిసికొందము. వీరు ముక్తినిగూర్చి యిట్లు వ్రాయించియున్నారు: —— పాపవిమోచనమునుబొంది సద్వర్తనముచే నీశ్వరునిబొంది యానందింపఁ గలుగుటయేముక్తి — అనఁగా పాపమునుండియు మృగత్వము నుండియు విముక్తులమై నిత్యానందమును బొందుటయేముక్తి. 'ఆత్మగుణము లన్నిటిని వృద్ధిచేసికొనుటయే ముక్తిమార్గము.' ఈయాత్మగుణము-