అద్వైతము - తద్విరోధులు.
89
ద్వేషమద్వైతమత తత్త్వము తెలియకపోవుటచే వచ్చినదనియు మనము గ్రహింపవలెను ఏమన :-
తెలసియో తెలియకయో వీరును దమయుపన్యాసములలో నద్వైతమునే బోధించినారు. అద్వైత మన నేమన "ఆవేదమునుగొనియే నిరాకారుఁడయిన యీశ్వరుఁడు కలడనియు జీవేశ్వరులకు భేదములేదనియు నద్వైతులు సాధింపయత్నించి యున్నారు" అనివీరు వ్రాసిన దానినిబట్టి జీవేశ్వరులకు భేదములేదని తెలుపుమతమని తేలినది. అనఁగాఁ బైనఁ బంతులవారు చెప్పినట్లుగా మనయాత్మలు దేవత్వము కలవియని తెలుపునదియని రూఢిపడినది. ఇఁక శ్రీరావుబహద్దరు వీరేశలింగము పంతులవారి మతమున జీవేశ్వరుల కనఁగా మనయాత్మలకును దేవునకును నెట్టిసంబంధము కలదో విచారింతము:-
"సృష్టిపదార్థములను బట్టియు మనయాత్మ తత్త్వమునుఁబట్టియు సృష్టికర్తయైన యీశ్వరుని గుణములను పరిశీలింపఁగా మనుష్యబుద్ధిచేతఁ దెలిసికోఁ దగియున్నంత వఱకు మనుష్యాత్మలయందుగల లక్షణములే యీశ్వరుని యందునుగానవచ్చుచున్నవి. కాఁబట్టి యేమనుష్యుఁడు స్థూలసూక్ష్మశరీరధారణమునుబట్టి సగము మృగమనియు సగము దేవుఁడనియు చెప్పఁబడుచున్నాఁడు, మాంస శరీరములోమృగత్వమును, జ్ఞానశరీరములో దేవత్వమును, కలవనుటకు సందేహములేదు." అనిశ్రీరావు బహదర్ కందుకూరి వీరే