Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

ఉపన్యాసపయోనిధి.

నలేక పోవుటయే దీనికి ముఖ్యకారణము. కొందఱు తాము తలంచునది కూడఅద్వైతమేయైనను దానినిగ్రహింపఁజాలకవృధా ద్వేషమునువహించుచున్నారు. ఇదివింతలలోఁ బెద్దవింత. అయినను నిట్టి విపరీత బుద్ధులు లోకమునం గలవు. ఇందుల కొక యుదాహరణము నిచ్చుచున్నాఁడను.

రావుబహదర్ కందుకూరి వీరేశలింగము పంతులవారు తమగ్రంథములందు బోధించినది యద్వైతమతమే. ఆసంగతినే వారు తెలిసికొనంజాలక యద్వైతము నీక్రింది రీతిగా నధిక్షేపింపఁజొచ్చిరి:—

మిత్రులారా ! మీరెప్పుడును బ్రహ్మలమగుదుమని కలలోను భ్రమింపఁ బోకుఁడు. పరబ్రహ్మమునకును మనకును గల తారతమ్యము పర్వతమునకును పరమాణువునకును గల యంతరముకన్నను కోటిరెట్లు హెచ్చయినదిగానుండును. "ఆశక్తులమైన మనకువలెనే సర్వశక్తుడైన యీశ్వరునకును పనిచేయుటకై కరచరణాద్యవయవములు కావలయుననియు, మనవలెనేయాతఁడును భార్యాసంగమాది తుచ్ఛసుఖముల కాశపడుననియు భ్రమింపక ఆతఁడు నిరాకారుఁడనియు నిర్వికారుండనియు నానంద స్వరూపుండనియుఁ దెలిసికొని నిశ్చలభక్తితో నిరంతరము నాకరుణాస్వరూపుని నుపాసింప యత్నింపుడీ”

ఈవాక్యములవలన వీరద్వైతమతద్వేషులనియు నీ