పుట:Upanyaasapayoonidhi (1911).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

64 ఉపన్యాసపయోనిధి.

"కువాద" మనియు "వృధావాగ్వాదమ" నియు నేమో పంతులవారు తిట్టి పోయుదురుకాని యిప్పుడా మాగన్ మును దామేయవలంబించిరి. శ్రీ న్యాయపతి సుబ్బారావుపంతుల వారు మనమతమునకు "హిందూ" సంజ్ఞయే యుత్తమమైన సంజ్ఞయని చెప్పియుండలేరు. దేనినిప్పుడందఱును హిందూ మతమనుచున్నారో దానింగూర్చి ముచ్చటించిరి. కాన నిట "హిందూ" సంజ్ఞం గూర్చి చర్చతోనేమిప్రయోజనమున్నది.

                                   *

హిందూమతము ఒంటెత్తుతనమును

గలిగించునదియా

  శ్రీపండితశివనాధశాస్త్రిగారు మొన్న నీనడుమ చెప్పినరీతిగా మన బ్రాహ్మసామాజిక సోదరులు మన హిందూమతధర్మములు మున్నగు వానిని బాగుగా దెలిసికొనక పశ్చిమదేశమతాదులధర్మములను బాగుగా నేర్చుకొనుట వాడుకయైయున్నది.  ఈ రీతిగాహిందూంతమన నెట్టిదోయెఱుంగని బ్రాహ్మసామాజిక భ్రాతలు దానినిగూర్చి విపరీతభాషణములు చేయుచుండుట కలదుకాని యదియొక వింతకాదు. విజౣలైనపండిత శివ