పుట:Upanyaasapayoonidhi (1911).pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

universal Soul of the universe.'(ఉపనిషణ్మతమునువురాణమతమను నొక్కటియేయని దీనితాత్పర్యము) ప్రజ్ఞలెల్లరు నిటుచెప్పుచుండగా బురాణ మతమువేఱనియు ఉపనిషణ్మతము వేఱనియు జెప్ప నీశ్వరవాది పత్రికాధిపతి గారు సాహసించుదున్నారు. కానిండు వారీవిషయమున జెప్పునది యంతయు నైనతరువాత సత్యనిర్ధారణార్ధమై వారివ్రాతనుచితరీదిని విమశిన్ంచుచున్నాము.

                                            *

బ్రహ్మమతము - ఈశ్వరవాది.

 ఈశ్వరవాదియను పత్రికారాజమును బ్రకటించు మాసోదరులు తమ 1901 నవంబరు సంచికలో మమ్ములగూర్చియిట్లనుగ్రహపూర్వకముగా వ్రాయించి యున్నారు.
  "ఆర్యమతబోధినిపత్రికధిపతులవంటి పండితులుసహితము బ్రహ్మమతము జుట్టుకత్తెరింపులమతమనియు, క్రైస్తవమతముయొక్క యవతారమే ననియు, మొదలగునపనిందల నారోప్ంచుచుండ జనసామాన్యమున కీవిషయమగో చరముగా నుండెననుట యదార్ధమని మనమందర మామోదింపవలసిన దేగదా" అని.