పుట:Upanyaasapayoonidhi (1911).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విషయమే, ఆత్మజ్ఞానమునుమతవిషయమే, భక్తియు మతవిషయమే, భవబంధ విమోచనమునుమతవిషయమే, సాంఘికధర్మమునుమతవిషయమే, విశ్వజ్ఞానానుభవమునుమతవిషయమె, ఇతరదేశములందు వీనిలోగొన్ని కొన్ని కొండఱు కొందఱికి మతములయినవి.మనదేశమునం దివియున్నియును గలసి మతమయి వీనినన్నిటిని వేఱువేఱుగా దీసిమొనిన మతైకదేశములయినవి. అందుమూలముచేతనే మనవారుచేయు ప్రతి వ్యాపారమునందుమతము ప్రధానముగా గాన్పించుచున్నది. అదిచూసి దీర్ఘదృష్టి లేనివారలు హిందువుల లో ప్రతివిషయమునుమతమే; నిలుచుటమతము, కూర్చుండుటమతమున కుండుటమతమని యాపాతరమణీయమగు నధిక్షేపణమునుజేయుట సంభవించుచున్నది.

    మొన్నమాపురమునంగలకళాశాలవిధ్యార్ధుల చేస్థాపింపబడిన "ఎక్సలుసియరుసొసయిటీ" యొక్కవాషికపు ప్రధమసభ గావింపబడినది. మా కళాశాలలో దేశచారిత్రముల బోధించుగురువలగు శ్రీనారాయణరావుగారు జాతి లక్షణముంగూర్చి ముచ్చటించుచు బైనుదాహరింపబడినభ్రమక్రాంతమైన యభి ప్రాయముననే ప్రమాణముగాదీసికొని మనలో మతమతి విస్తారమైనదనియు దానగీడు మూడుచున్నదనియు హాస్యరస ప్రధానమగు వాక్యజాలములతో నుపన్యసించిరి.  అందుపై నాడుసభాధ్యక్షతను వహించిన శ్రీఆర్.వెంకటరత్నము నాయుడుగారీవిషయమును దీసికొని మత