పుట:Upanyaasapayoonidhi (1911).pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రహ్మసమాజమతము హిందూమతమా?

    శ్రీమదార్యమతబోధినిలొ బ్రచురింపబడుచున్న "కీర్తిశేషులైన ప్రతాపచంద్ర ముజుందారుగారు- బ్రహ్మసమాజము" అను శీషిన్ కగల వ్యాసమును నేను వ్రాయుచున్నానని భ్రమపడి మదాప్తులగు శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారుగారు దురాగ్రహావేశపరవశులై "ఆర్యమతబొధినిబ్రహ్మసమాజము" అను శీషిన్ కక్రింది నేవేపూ యవ్యక్త మధురాలాపములను జేసిరి.  వీరి తెలివితేటలనుబట్టి ప్రత్యుత్తర మవసరము లేకపోయినను వీరియాశ్రయమునుబట్టి యించుకసమాధానము నిచ్చుచున్నాను.  బ్రహ్మసమాజమతము నిక్కమయిన హిందూమతమంట ! ఇది పెద్దబొంకు ఏమన (1) ఈవఱకు హిందూదేశమునందు బుట్టిన ప్రతిమతము ను పునజన్ న్మవాదము నంగీకరించుచున్నవి.  జీవునకు బునజన్ న్మము కలదని చెప్పనిమతములు భరతఖండముననెన్నడును బుట్టియుండలేదు.  ఇందులకు రావుబహదరు కందుకూరి వీరేశలింగంపంతులువారి గ్రంధపరంపరయే సాక్ష్యమిచ్చుచున్న "చూడుడు "ఈవిషయమున (జన్మాంతరవిషయమున) నన్యదేశీయుల మతమునెల్లను బిన్నాభిప్రాయములు కలవి గానున్నను మనదేశమునందున్న మతములన్నియు నైకకంఠ్యముగా జీవాత్మకు జన్మపరంపర కలదినియే ఘోషమిడుచు