పుట:Upanyaasapayoonidhi (1911).pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జగముసృజింపబడినదా?

  లోకమును భ్రమింపజేయుచున్నవానిలో "సృష్టి" యెకటి భగవంతుడు ప్రపంచమును సృజించినాడనిన లోకులుకుమ్మరవాడు కుండల సృజించినట్లు బ్రహ్మాండభాండములను సృజించుచున్నాడని బావించుచున్నారు. సృష్టియన నేమో తెలిసికొనినవారు తక్కువగాను, దానిం గూర్చి తప్పుటూహలంబడుచున్న వారి హెచ్చుగానునున్నారు.  సృష్టియన గుమ్మరవాడుకుండల జేయుట వంటిదను కొనుటచే కుండకును కుమ్మరవానికిని వస్తుతత్వవిషయమంలో సంబంధమేరీతిని లేదో యారీతినే జగత్తునకును బ్రహ్మమంనకునుసంబంధ లేదను తలంపుగలిగినది. కాని ప్రపంచమును బాగుగా దరచి చూచినవా రెవరును ఈవాదమంగీకతించియుండలేదు.  ఈకాలమున హూణులందు బయలు వెడలిన ప్రకృతిశాస్త్రములు సర్వజన సమాదరణీయములై యున్నవి. వీనినిబట్టి చూచిన భగవంతుడు కుమ్మరవానివలె జగత్తులను సృజించు చున్నాడను భావము పోయి ప్రపంచ మొక పదార్ధము నుండియే క్రమక్రమముగా వికారము నందుచున్నట్లు తేలినది.  ఈ వాదమునువారు ఎవల్యూషన్ ధియరీ (Evolution theory)  అందురు.  దీనినింతకుపూర్వమె మనపూర్వులు కనిపెట్టియున్నారు. దీనినే పరిణామజాడమందు