పుట:Upanyaasapayoonidhi (1911).pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దానిని బుద్దిమంతులు పరిహసింతురా? ఇప్పటి ప్రకృతిశాస్త్రములు క్రమక్రమ ముగా నద్వైతముముని స్థాపించు స్థితికేవచ్చుచున్నవని బుద్దిమంతులు చెప్పు చున్నారు. కావునముందు దేలబోవునది "తత్త్వమసి" యను మహాధర్మమే యగుననుట బుద్దిమంతుల లక్షణము. ఈయపార బుద్దిసంపన్నుడింకను నిట్లు వ్రాయుచున్నాడ్. "ఇంకను జ్ఞానాభి వృద్దియైనకొలదిని దేవుని కళ్యాణగుణము లింకను క్రొత్తవియేవి బాలుబడునో యెవరెఱుగుదురు? అందువలన మనకెట్టి యధికాత్మానందము కలుగునో యెవ్వరూహింపగలరు" ఇట్టి సంశయాత్మ జీవు నకు దేవుడు తన సర్వసమును నొసంగడని యెట్లు చెప్పగలడు? ఎట్లద్వైత మును ద్వేషింపగలడు?

                                 *

ఈశ్వరమాయ

 లోకమునంగలహానికంతకును మూలమజ్ఞానమై యున్నది అజ్ఞాన దూషితుడు నగునరుడుమిత్రుని అమిత్రునిగాను అమిత్రునిమిత్రునిగాను యోగ్యతను అయోగ్యతనుగాను అయోగ్యతను యోగ్యతగాను యుక్తినికుయుక్తి గాను కుయుక్తిని యుక్తి