పుట:Upanyaasapayoonidhi (1911).pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రావుబహదర్ వీరేశలింగం పంతులుగారి

యాత్మజ్ఞానము.

   శ్రీరావుబహద్దరు కందుకూరి వీరేశలింగము పంతులుగారులోకమును దమ్ము ననకరింప గోరికొంచున్నారు.  పలువురుపత్రికాధిపతులు శ్రీపంతులవారు మన దేశమునకు మార్గదర్శకులై యున్నారని నుడువుచున్నారు.  బహుజనులు వారిని ప్రమాణముగాదీసికొనబొవుచున్నారు.  ఇట్టివరియెకూ సామధజ్య మెంత టిదో లోక మెఱింగియుండుట యవసరముకాదను బుద్దిమంతు లుండజాలరు కదా. కావున వీరి సామర్ధ్యమునుగూర్చి లోకహితార్ధమించుక వ్రాయుచున్నాడను. జ్ఞానములలోనెల్ల ఆత్మజ్ఞానము ముఖ్యమయినదని యందఱును అంగీకరించియున్నారు.  ఆహేతువుచేతను ఈ లోకమునకు బహూపకారకమై యాస్తిక్యమును గలిగించుచున్న విగ్రహారాధనమును బరిపరి విధముల నిందించి మిక్కిలి దుస్సాధ్యమయిన యాత్మజ్ఞానముకలవారికి నియమింపబడిన మానసికారాధనమునుసర్వత్ర యుంచవలెనని నొక్కి వక్కాణీంచుటచేతను బహుధర్మములను జక్కగా బోధించు జన్మాంతరాదులను దృణీకరించుచుండుటచేతను శ్రీ